
ఫోటో : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు…
రుద్రూర్, ఏప్రిల్ 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నివసిస్తూ గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, తోట సంగయ్యలు మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. లక్ష్మీ పుత్రుడు అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై జీవన్ రెడ్డి శనీశ్వరుడని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జీవన్ రెడ్డి పార్టీలోకి అడుగు పెడితే సామాన్య ప్రజలు దూరమయ్యారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు. మరోసారి శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజు, పట్టేపు రాములు, లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, మొద్దుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.