
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( హుజురాబాద్)..
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా సిసి రోడ్డును ప్రారంభించిన బిజెపి మండల సీనియర్ నాయకులు ఉడుత కుమార్ యాదవ్..అనంతరం తను మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఎలాంటి సమస్య ఉండకూడదనే లక్ష్యంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లి కు వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడం వలన ప్రజలకు రావడం పోవడం చాలా ఇబ్బంది కలుగుతుందని తెలుసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలపగా తను తక్షణమే స్పందించి ఎంపీ నిధులతో సిసి రోడ్డును సాంక్షన్ చేశారని ఉడుత కుమార్ తెలిపారు.ఆయన కృషి ఫలితమే పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లి కు వెళ్లే సిసి రోడ్డును మంగళవారం రోజున ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాధారపు రామచందర్,పోతిరెడ్డిపల్లి బిజెపి నాయకులు తిప్పని సమ్మయ్య, దండ హరీష్ రెడ్డి, మొండయ్య, ఉడుత సదయ్య, చేపూరి మొగిలి, బూత్ అధ్యక్షులు జాన అరవింద్, దసారపు ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
