
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు.
పయనించే సూర్యుడు: మార్చి 05: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం విశేష సేవలు అందిస్తూ ఉన్న మాజీ ఎమ్మెల్యే టి పి సి సి ఉపాధ్యక్షులు ప్రస్తుత అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ పోదెం వీరయ్య కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించాలని ములుగు జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన పార్టీలో చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నో ప్రలోభాలకి గురిచేసినప్పటికీ ఎంతో ఆశ చూపిన నమ్మిన సిద్ధాంతాన్ని కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఓటు వేసిన ప్రజలకి కార్యకర్తలకి అన్యాయం చేయకుండా ప్రజల మధ్య ఉంటూ విశేష ఆదరణ చూపిస్తూ ప్రజలకి కార్యకర్తలకి అండదండలుగా ఉంటూ ప్రతి ఒక్కరి క్షేమంకై శ్రమించిన పొదెం వీరయ్య కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్గ స్థానంలో తీసుకోవాలని తెలియజేశారు. లేనియెడల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసి ప్రజలతో ఏకమై ఉద్యమానికైనా సిద్ధం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ యొక్క విషయాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. కానీ ఎడల తప్పక పొదెం వీరయ్యకై ఉద్యమానికైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు.
