
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 షాద్ నగర్ ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని పురష్కరించుకొని ఈ రోజు ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.17వ శతాబ్దాంలో జన్మించిన సర్వాయి పాపన్నగౌడ్ కులవృత్తి చేసుకుంటూ జీవించేవాడని చెప్పారు. తురుష్క్, మొగలుల పాలనలో సైనికుల ఆగడాలను ఎదిరించి గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ, సహచర ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,శ్రీహరి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.