Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్పోలవరం నిర్వహితులకు కొత్త భూసేకరణ చట్టప్రకారం సబ్ రిజిస్టర్ విలువ

పోలవరం నిర్వహితులకు కొత్త భూసేకరణ చట్టప్రకారం సబ్ రిజిస్టర్ విలువ

Listen to this article

అల్లూరి జిల్లా,దేవిపట్నం మండలం పయనించే సూర్యుడు
జనవరి:-11

పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టర్ విలువకు మూడు రెట్లు అందంగా అనగా ఎకరానికి 36 లక్షలు భూపరిహారం చెల్లించాలి.ఆదివాసి జేఏసీ,ఆదివాసి మహాసభ డిమాండ్.

పోలవరం పనులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్ష నిర్వహిస్తున్నందున నిర్వాసితుల సమస్యలు కూడా సమీక్షించాలి. పోలవరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించాలి.

అల్లూరి జిల్లా, దేవీపట్నం,
జనవరి 11.

ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ, ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధార్టీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ….(1) గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డబ్ల్యూపి నెంబర్లు 17368, 17705,18020,19067,19717 మరియు 27095 ఆఫ్ 2005 లలో 2007 లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన 276 గ్రామాలను అర్ అండ్ అర్ కాలనీలకు తరలించేందుకు నీరు నిలవ చేసేవిధంగా నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొంది.అదేవిధంగా 2014 జనవరి 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఆరు నెలల ముందే నిర్వాసితులను ఖాళీ చేయించి ఆర్ అండ్ ఆర్ కాలనీలకు పంపించాలని పేర్కొంది. కావున మొత్తం నిర్వాసిత గ్రామాలన్నీ ఒకే దశలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించి ఖాళీ చేయించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని అప్పటివరకు నిలుపుదల చేయాలని పేర్కొంది.(2) రాష్ట్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో.ఆర్. నెం. 641 ప్రకారం నిర్వాసితుల ఒక్కొక్క ఇంటికి ఆదివాసీ ప్రాంతంలో 4,55,000/- లు ప్రభుత్వం కేటాయించాలి.అయితే 2,84,000 లు మాత్రమే కేటాయించింది.దీంతో గృహ నిర్మాణం నాసిరకంగా తయారయింది. నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్ము మొత్తం గృహ నిర్మాణకే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పోలవరానికి మళ్ళించారుదీనిపై సమగ్ర విచారణ జరిపించాలి.నిర్వాసితుల గృహ నిర్మాణాలకు తగిన నిధులు కేటాయించాలి.(3) రాష్ట్ర ప్రభుత్వం 2021 లో జారీ చేసిన జీవో.ఆర్.నెంబర్ 224 ప్రకారం ఒక్కొక్క నిర్వాసితునికి 10 లక్షల రూపాయలు చెల్లించాలి.మూడున్నర సంవత్సరాల గడిచిన ఏ ఒక్కరికి ఈ మేరకు పది లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించలేదు.వినియోగదారుల సూచిక ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొత్తం కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించవలసి ఉంది. 2014లో 100 రూపాయల విలువ ఇప్పుడు 169 రూపాయలు అయ్యింది.ఈ మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎస్సీ ఎస్టీలకు 11 లక్షల 60 వేల రూపాయలు, గిరిజనేతరులకు 10 లక్షల 75 వేల రూపాయలు చొప్పున లెక్క కట్టి చెల్లించాలి. దీనికి తోడు గిరిజన ప్రాంత పంచాయతీరాజ్ చట్టం (పీసా) చట్టం ప్రకారం 500 పని రోజుల వేతనాలు అంటే సుమారు రెండు లక్షల రూపాయలు ఆదివాసులకు గిరిజనులకు అటవి ఉత్పత్తులు కోల్పోతున్నందుకు పరిహారం చెల్లించవలసి ఉంది.ఈ మేరకు ఏ ఒక్క నిర్వాసితునికి పరిహారం చెల్లించలేదు.(4) కొత్త భూసేకరణ చట్టం సెక్షన్ 42 (3) ప్రకారం ముంపు గ్రామాలలోని సుమారు 50 వేల ఎకరాల వన సంరక్షణ సమితి భూములకు చెల్లించవలసిన పరిహారం చెల్లించలేదు.ఈ మేరకు ఈ భూములకు చెల్లించవలసిన పరిహారం విషయమై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నివేదిక ఇప్పటివరకు పంపలేదు.ఫారెస్ట్ భూములలో అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఇచ్చిన పట్టాలకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు.అదేవిధంగా డి – పారం పట్టాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు.(5) కొత్త భూ సేకరణ చట్టం రూల్ 24 ప్రకారం ముంపు గ్రామాలకు చెందిన భూములేని ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి అందించే విధంగా ప్రణాళిక రూపొందించవలసి ఉంది.ఈ మేరకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రానికి నివేదించలేదు.(6) భూసేకరణ నోటిఫికేషన్లు కాలదోషం పెట్టాయి. కాబట్టి అర్ అండ్ అర్ కాలనీలోకి నిర్వాసితులు ప్రవేశించే రోజుకు 18 సంవత్సరాలు నిండిన వారిని ప్రత్యేక కుటుంబంగా పరిగణించి ప్యాకేజీ చెల్లించాలి.(7) పోలవరం నిర్వాసితులు లక్షా 6వేల కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం గతంలో చెప్పింది.ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వాలు అర్ అండ్ ఆర్ కాలనీకి తరలించిన వారి సంఖ్య 13వేలు మాత్రమే.కావున ముందు నిర్వాసితులను తరలించేంటవరకు నీరు నిలువ చేసే ప్రక్రియ ప్రారంభించరాదు.(8) కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం చెల్లించవలసి ఉంది.అయితే చట్టాన్ని కలెక్టర్ పాటించడం లేదు.ఈ మేరకు చర్యలు తీసుకోవాలి.(9) అర్ అండ్ అర్ కాలనీలకు చట్టంలో పేర్కొన్న 25 మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు.(10) జాతీయ ఎస్టి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సులలో గిరిజనులకు భూమికి భూమిగా నాసిరకం భూములు ఇస్తున్నారని,కమాండ్ ఏరియాలో భూములు ఇవ్వాలని సిఫార్సు చేసింది.ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కమిషన్ చేసిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.(11) ఆదివాసులకు గిరిజనులకు 13 లక్షల 60 వేలు చట్టప్రకారం చెల్లించవలసి ఉండగా గతవారం రోజులుగా వారి అకౌంట్లో కేవలం సగం మాత్రమే అంటే 6లక్షల 86 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.మిగిలిన సగం ఎప్పుడు చెల్లిస్తారో నిర్వసితులకు చెప్పడం లేదు.కాగ్ నివేదిక పేర్కొన్న విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోలవరం ప్రాజెక్టు విషయమై అవగాహన ఒప్పందం లేదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెంటనే కేంద్రానికి నివేదించి అవగాహన ఒప్పందం కుదుర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.అదే విధంగా ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు దాటుతున్నందున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివాసి మహాసభ,ఆదివాసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తుంది.

ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు అరగాటి వీరభద్ర రెడ్డి,కెచ్చల అబ్బాయి రెడ్డి,జక్కల పాండవులు,మద్దిపాటి సతీష్,పోచమ్మ,యామగిరి వెంకటేశ్వరరావు,ఏలూరు జిల్లా నుండి పూనెం విష్ణు,మీడియం వెంకటేష్,ఆదివాసి జేఏసీ నాయకులు యలగాడ నాగేశ్వరరావు,రాయుడు ప్రసన్న,కె.నాగమణి,ఆర్.ప్రవీణ,చెదల నాగిరెడ్డి,అరగాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments