
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు అధికార సిబ్బందికి, కుటుంబ సభ్యులకు ఇల్లందు పాత బస్సు స్టాండ్లోని అయిత ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కంటి పరీక్షలు ఖమ్మం పట్టణానికి చెందిన మాక్స్ విజన్ వైద్యశాల డాక్టర్ శరత్, నరేందర్ ఆధ్వర్యంలో 80 మంది పోలీస్ వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు. ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో వారిని గుర్తించి, ప్రథమ చికిత్స పరీక్షలు చేయించి, మేజర్ ప్రాబ్లం ఉన్న వారికి ఖమ్మంలో ఉన్న శరత్ మాక్స్ విజన్ డాక్టర్ ఆధ్వర్యంలో వారికి ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను, ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, గుండాల సిఐ, టేకులపల్లి సబ్ డివిజన్ ఎస్సైలు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.