
పోలీస్ కమిషనర్ కార్యాలయం
పయనించే సూర్యుడు. మార్చి 4. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం : పోలీస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాగుపండి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ప్రత్యూష గారు ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ వైద్య పరిక్షల శిభిరాన్ని నిర్వహించామని ఏఆర్ ఏసీపీ నర్సయ్య తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని వైద్య పరిక్షలు చేసుకున్నారని తెలిపారు. నిరంతరం పన వత్తిడిలో వుండే పోలీస్ సిబ్బంది శ్రేయస్సు కోసమే ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
కార్యక్రమంలో ఆర్ ఐ అప్పలనాయుడు పాల్గొన్నారు.
