
పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (పొనకంటి ఉపేందర్ రావు )
పోషక ఆహారమాస వారోత్సవాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం మండలంలోని సుక్కల బోడు రైతు వేదికలో జరిగిన పోషణ్ అభియాన్ లో భాగంగా పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. మండలంలో సొంత భవనాలు లేని అంగన్వాడి కేంద్రాలకు నిధులు మంజూరు చేస్తానన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్, కోయగూడెం మాజీ సర్పంచ్ ఉమా, ఐసిడిఎస్ సిడిపిఓ కే. మంగతారా, ఎంపీడీవో మల్లేశ్వరి, పిహెచ్సి సిహెచ్ఓ పార్వతీ, రమేష్, అంగన్వాడి సూపర్వైజర్లు అనురాధ, యశోదమ్మ, లక్ష్మి, నిర్మల, విజయకుమారి, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు