
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం సందర్భంగా మంచినీళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ప్రారంభించడంపై లభించే పోషకాలపై బాలింతలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, చంద్రకళ, బాలింతలు,గర్భిణీలు పాల్గొన్నారు.