
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కొరకు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలోక్ అగర్వాల్ గారు తన శ్రీమతి సంగీత అగర్వాల్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది బూర్గుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మహిళలకు ఇది ఎంతో చక్కని అవకాశమని అందరు సమయపాలన పాటించి శ్రద్ధగా మంచే నైపుణ్యాన్ని సంపాదించాలని అప్పుడే మీరు మార్కెట్లో నిలదుక్కుకుంటారని సంగీత అగర్వాల్ గారు సూచించారు అదేవిధంగా మహిళలు పనితో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని అప్పుడే మీ కుటుంబము మంచిగా ఉంటుందని తెలియజేశారు డాక్టర్ ఆలోక అగర్వాల్ గారు ట్రైనర్ తులసి గారికి క్వాలిటీ పట్ల పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డేగా శంకర్ గారు ప్రోగ్రాం సీనియర్ మేనేజర్ మురళీకృష్ణ గారు ప్రగతి సిబ్బంది జగదీష్, కార్తీక్, ప్రగతి, శ్రీకాంత్, లావణ్య, శృతి, శ్వేత మరియు మహిళలు పాల్గొన్నారు
