
నిరుపేదలకు ఒక వరం
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య
పయనించే సూర్యుడు మే 31 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం బోడు కొత్తగూడెం, కొప్పురాయి గ్రామం నందు ఉపాధి హామీ శ్రామికులకు గడ్డపార, బాస్కెట్ లను,బొచ్చలను పంపిణీ చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య,ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందచేస్తూ మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, రాజీవ్ యువ వికాసం వంటి అనేక పథకాలను ప్రజలకు అందిస్తూ రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందచేసే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ముత్తయ్య, ఏపీవో కలింగి శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులు.ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఈది గణేష్,రెడ్యానాయక్, భద్రు,భూక్యా సర్దార్, బానోత్ రవి,తులసి రాం, రాందాస్, సుభాష్ చంద్ర బోస్, మధు బాబు, శివాజీ,భూక్యా సైదులు,కుంజా సాంబయ్య, అన్నారపు రవి, చిలువేరు చంద్రశేఖర్,మాసిపాక రామస్వామి, పూజారి సంపత్, సుధీప్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.