
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రెండేళ్లలోనే ఆగమాగమైంది. పాలన చేతగాక, దిక్కుమాలిన మాటలు చెబుతూ, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు” అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజ్ఞాపూర్‌లోని ఎస్ఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.సర్వేల్లో బీఆర్ఎస్‌దే పైచేయి.. అతివిశ్వాసం వద్దు'”ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 పరిషత్‌లను బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతోంది. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే, మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఒక కుటుంబంలా పని చేయాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, అతివిశ్వాసం పనికిరాదు” అని హరీశ్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, “ఎట్లుండె తెలంగాణ ఎట్ల అయ్యింది అనేది ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఆరోజు నీళ్ళు ఎట్లా వచ్చాయి, ఈరోజు మంచి నీళ్లు ఎట్లా వస్తున్నాయి” అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఇంటింటికీ వచ్చి చెత్త తీసుకెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “డీజిల్ పోయించేందుకు పైసలు లేక తాళాలు అప్పజెప్పి వెళ్లిపోయిన పరిస్థితి. చెత్త ఎత్తేవాళ్లు లేరు, బుగ్గలు వేసేవాళ్లు లేరు, మంచి నీళ్ల పైపు పగిలిపోతే అతుకపెట్టేవాడు లేడు. కొత్తగా చేసింది లేదు, ఉన్నది నడిపించే సత్తా లేదు. ఇవన్నీ స్వీయ అనుభవంలో ఉన్నవే. ప్రజలకు గుర్తు చేస్తే చాలు” గ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు.అంతా మోసం’ఉద్యోగాల హామీల విషయంలో రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. “మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని మాట తప్పిండు. 12 వేల ఉద్యోగాలు ఇచ్చి, 60 వేలు ఇచ్చినం అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ లక్షా 68 వేల ఉద్యోగాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి అశోక్ నగర్‌లోని విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధమయ్యారు” అని హెచ్చరించారు.పింఛన్ల పెంపు విషయంలోనూ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. “రాహుల్ గాంధీ పత్తా లేడు, రేవంత్ రెడ్డి పోలీసు వలయం పెట్టుకొని తిరుగుతున్నడు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతా అని మోసం చేసిండు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు, కానీ రకరకాల కారణాలు చెప్పి 2 లక్షల పింఛన్లు కోత పెట్టారు. అవ్వాతాతలకు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని మాట తప్పిండు రేవంత్ రెడ్డి. నాలుగు వేల పెంపు దేవుడెరుగు 20 నెలల్లో రెండు నెలల పింఛన్లు ఎగ్గొట్టిండు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగించారు.రైతు బంధు, ఎరువుల కష్టాలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. “బోనస్ పేరిట చెల్లిస్తామన్న రూ. 1200 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎరువుల కోసం లైన్లలో నిలబడ్డారా? కాంగ్రెస్ వచ్చింది మళ్లీ రైతులకు తిప్పలు మొదలయ్యాయి. కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు. 11 విడతల్లో రూ. 73 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో వేశారు కేసీఆర్” అని గుర్తు చేశారు.”కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య ఇస్తే, రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతు బంధు ఇస్తున్నడు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు బంధు ఎగ్గొట్టిండు. రైతు బంధు సకాలంలో, సక్రమంగా రావాలంటే కాంగ్రెస్‌ను ఓడగొట్టాలి. జనుము, జీలుగు విత్తనాలు కూడా కాంగ్రెస్ పాలనలో దొరకని పరిస్థితి. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, కరెంటు… ఇవేవి ఇవ్వలేని చేతగాని సర్కారు కాంగ్రెస్. రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలి? రైతులతో చర్చ పెట్టాలి. వారికి అన్నీ గుర్తు చేయాలి” అంటూ రైతులకు ఎదురవుతున్న కష్టాలను వివరించారు.భూముల రేట్లు పతనం.. అభివృద్ధికి కేరాఫ్ గజ్వేల్! భూముల ధరల పతనంపై కూడా హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. “ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అని నాడు చంద్రబాబు అన్నడు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక సీన్ మళ్లా రివర్స్ అయ్యింది. పెళ్లికోసమో, చదువుల కోసమో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇంకో రెండేళ్లు కాంగ్రెస్ పాలన ఉంటే భూముల రేట్లు సగానికి సగం అవుతాయి. రెండేళ్లలో తెలంగాణ ఆగమైంది” అని ఆవేదనగా అన్నారు.మహిళల హామీలపైనా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. “ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తానన్నడు, 20 నెలల్లో రూ. 50 వేల బాకీ పడ్డడు. తులం బంగారం అన్నడు మాట తప్పిండు. ఆడపిల్లలకు స్కూటీ అని మాట తప్పిండు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండు. మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కోటి మందిని కోటీశ్వరులు చేస్తానన్నడు. బీఆర్ఎస్ హయాంలో లాగే 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తూ, 20 లక్షల వడ్డీ లేని రుణాలు అని ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారు” అని విమర్శించారు.”యువత, రైతులు, మహిళలు… అన్ని వర్గాలను రేవంత్ మోసం చేసిండు” అని హరీశ్ రావు తేల్చి చెప్పారు. “మన జిల్లా మీద పగబట్టినట్లు చేస్తున్నారు. ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. నిధులు జిల్లాకు ఆపారు. అందరం కలిసి పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా గజ్వేల్ మారింది. గజ్వేల్ ప్రతిష్టను పెంచింది కేసీఆర్. అన్ని ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు గులాబీ జెండా ఎగరాలి, అందరూ కలిసి పని చేయాలి” అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు.