
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 23:- రిపోర్టర్( కే. శివకృష్ణ )
“ప్రతి మనిషి అభివృద్ధే నా లక్ష్యం –ప్రజల అభీష్టమే నా మార్గం” అని నమ్మే ప్రజానాయకుడు, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం బాపట్ల పట్టణంలోని 3వ వార్డులో పర్యటించి, ప్రజల దైనందిన సమస్యలను నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అర్హత కలిగిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, పంపిణీకి వేగం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మురుగు నీటి కాలువలు & డ్రైనేజీ వ్యవస్థ: కాలువలు నిండిపోయి సురక్షితంగా ప్రవహించని ప్రాంతాల్లో తక్షణ స్పందనతో శుభ్రపరిచే పనులకు ఆదేశాలిచ్చారు. డ్రైనేజీ సమస్యలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున వెంటనే పరిష్కరించాలని అధికారులకు స్పష్టంగా తెలిపారు. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను విని,తక్షణమే చర్యలు తీసుకునే చొరవ అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు,మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర్లు మరియు వివిధ శాఖల అధికారులు,తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.