సిద్దిపేట సిపి విజయ్ కుమార్
(పయనించే సూర్యుడు అక్టోబర్ 27 రాజేష్) దౌల్తాబాద్ అక్టోబర్ 27 ప్రజల
రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలని సిద్ధిపేట సిపి విజయ్ కుమార్ అన్నారు సోమవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలని తెలిపారు జూదం పేకాట అసాంఘిక కార్యక్రమాలపై ఇసుక మట్టి పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలి సూచించారు పాత నేరస్థులపై కేడీలు బీసీలు సస్పెక్ట్ లను తరచూ తనిఖీలు చేయాలని సూచించారు పాత నేరస్థులపై నిఘా ఉంచాలని తెలిపారు పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు తోటా సీఐ లతీఫ్ దౌల్తాబాద్ ఎస్సైలు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


