అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పయనించే సూర్యుడు ప్రతినిధి గంగాధర్ (20: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో సబ్ కలెక్టర్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
1. పెద్దకడబూరు మండలానికి చెందిన రామకృష్ణకి సంబంధించి సర్వే నంబర్ 428/ఏ2 నందు 2.00 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు 1.44 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది దయతో విచారణ చేసి మిగిలిన 56 సెంట్ల భూమిని ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
2. ఆదోని పట్టణం 41వ వార్డు నందు EWS లేఅవుట్ నందు 80 అడుగుల రోడ్డు ఉండగా 40అడుగుల వరకు ఆక్రమణకు గురైంది. దయతో విచారణ చేసి ఆక్రమణను తొలగించాలని ఆదోని పట్టణానికి చెందిన గౌస్ అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి కె. వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వాయర్స్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి, డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డి, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్ షఫీ వుల్లా, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.