పయనించే సూర్యడు //23//జనవరి //హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గంలోని చల్లూర్ గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తుల సమస్య: “ప్రజలు ఎన్ని దఫాలుగా దరఖాస్తులు పెట్టుకోవాలి? ప్రతి దరఖాస్తుపై 30-40 రూపాయల ఖర్చు అవుతోంది. ఇది ప్రజలకు ఆర్థిక భారంగా మారింది.”అన్నారు. “ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రుణమాఫీపై విమర్శలు: “రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందని చెబుతున్నా, చల్లూర్ గ్రామంలో 50% రైతులకు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు.”అన్నా రు. “రుణమాఫీపై ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా అందరికీ జరిగిన రుణమాఫీ వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి, అని “2 లక్షల రుణమాఫీ హామీ వెంటనే వెంటనే ఇంకా 50% మందికి ఇవ్వాలన్నారు. రైతు సమస్యలు:“వానకాలం మరియు యాసంగి రైతుబంధు డబ్బులు ఇంకా అందలేదు. రైతులు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, అని తెలిపారు. “రైతు భరోసా పథకాన్ని వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఇళ్ల సమస్యలు: “ఎస్సీ, ఎస్టీ లకు రూ.6 లక్షల ఇళ్ల హామీ ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు.”“అర్హులైన పేదలందరికీ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. రేషన్ కార్డులపై విమర్శలు: “రేషన్ కార్డుల విషయంలో ఆదాయం పరిమితి పెంచినా, అర్హులందరికీ కార్డులు అందడం లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం,“అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్లలో వివక్ష: “ఎన్నికల ముందు రూ.4,000 పెన్షన్ హామీ ఇచ్చి, అమలు చేయకపోవడం తగదని, “ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ అమలు జరుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు.ప్రజా వ్యతిరేక పాలన: “ప్రస్తుత ప్రభుత్వం మోసాలపై ఆధారపడి ప్రజలనువిస్మరించింది.” ప్రజాసమస్యలను ప్రశ్నించే వారిపై అరెస్టులు చేయడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శమన్నారు. మహిళా సంక్షేమం:“మహిళల కోసం హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకపోవడం చాలా బాధాకరమని,ప్రభుత్వం ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయడం ఆపాలని . రైతులు, కూలీలు, పేదలు, మహిళల సమస్యలను పట్టించుకొని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేసారు.లేనిపక్షంలో ప్రజా పోరాటాలు మరింత ఉధృతంగా సాగుతాయి,అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజి మార్కెట్ చెర్మైన్ వాలా బాలకిషన్ రావు, వీణవంక సింగల్ విండో చెర్మైన్ విజయ్ భాస్కర్ రెడ్డి,మాజి ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి,మాజి జడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.