
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”
కార్యక్రమం నిర్వహించిన జిల్లా పోలీస్ ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్*
దివ్యాంగురాలి వద్దకు స్వయంగా వెళ్ళి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్న ఎస్పీ
సమస్యలు విన్నవించుకున్న 63 మంది అర్జీదారులు.
అర్జీదారుల సమస్యలను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్
పయనించే సూర్యుడు బాపట్ల మే:- 13 రిపోర్టర్ (కే. శివకృష్ణ)
అర్జీదారుల సమస్యలను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల సమస్యలను చట్టపరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర సమస్యలపై 63 మంది అర్జీదారులు వారి సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు.బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన పోతుపాలేపు నాగరాజ (38 సం.//) తన సమస్యను చెప్పుకోవడానికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చినది. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా ఆమె వద్దకే వెళ్ళి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారికి ఫోన్ చేసి చట్ట పరిధిలో విచారించి త్వరిత గతిన సమస్యను పరిష్కరించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి. విఠలేశ్వర్, సిసిఎస్ డిఎస్పి జగదీష్ నాయక్, పిజిఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.