
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 05. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ఆరోగ్యంపై విద్యార్థులు శ్రద్ధ పెట్టి బయటి ఫుడ్ తీసుకోవడం మానివేయాలిజీవితంలో సులభంగా ఏది రాదు… వచ్చినా మన దగ్గర ఉండదుఎన్.ఎస్.పి. క్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన, మోటివేషన్ తరగతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీవితంలో విద్యార్థులు ప్రణాళికతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యం సాధించడంలో విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, స్థానిక ఎన్.ఎస్.పి. క్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన, మోటివేషన్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వేగంగా నడిపితే ప్రమాదాలు జరుగుతున్నాయనే భయం చాలా మంచిదని, భయం అనేది సర్వ సాధారణ మని, ప్రతి మనిషికి భయం ఉంటుందని, సమయంతో భయాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలని అన్నారు. అలాగే పరీక్షల గురించి భయం తగ్గాలంటే ముందు నుంచే ప్రణాళికతో చదవాలని అన్నారు. మనకు జీవితంలో ఏది సులభం కాదని, శ్రమ లేకుండా వస్తే మనకు విలువ ఉండదని అన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు క్రమ పద్ధతిలో కష్టపడాలనీ, ఈ రోజు పని రేపటికి వాయిదా వేయవద్దని, పనులు వాయిదా అలవాటు పడితే లక్ష్యాలను చేరుకోలేమని, జీవితంలో సరైన సమయంలో లక్ష్యం దిశగా పని చేయకపోతే గొప్ప భవిష్యత్తు కోల్పోతామని అన్నారు.రాబోయే నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని, బయట జంక్ ఫుడ్, చిప్స్ తిన వద్దని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని అన్నారు. మనం ఎంత పరీక్షకు సిద్ధమైన ఆరోగ్యంగా లేకుంటే ఆశించిన ఫలితాలు సాధించలేమని ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా కీలకమని కలెక్టర్ తెలిపారు. మన లక్ష్యాలను ఎలా సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని, లేని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వైఫల్యాలే వస్తాయని, మన వైఫల్యాలకు ఇతరులను ఎప్పుడూ దూషించవద్దని, ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాం వంటి అంశాలు మన చేతిలో లేవని, పరీక్షలలో మనం ఎలా రాస్తామనే అంశం మాత్రమే మనపై ఆధారపడి ఉంటుందని, మన పనిని మనం జాగ్రత్తగా, సరిగ్గా చేయాలని కలెక్టర్ తెలిపారు.విద్యార్థులు తమపై నమ్మకం పెట్టుకోవాలని, ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలని, మన స్నేహితులు ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారో అందులో వారికి అవసరమైన శిక్షణ అందించాలని, మనతో పాటు మన స్నేహితులు కూడా బాగా పరీక్షలు రాసేలా వారిని సన్నద్ధం చేయాలని అన్నారు.విద్యార్థులు నమ్మకంతో పరీక్షలు రాయాలని, జీవితంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎన్ని ఆటంకాలు వచ్చిన సాధించాలని, గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత ఇతరులకు సహాయం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.అంతకుముందు మోటివేషన్ స్పీకర్ నాగేశ్వర్ రావు పిల్లలకు నిర్వహించిన అవగాహన, మోటివేషన్ తరగతిని జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి కూర్చొని ఆసక్తిగా విన్నారు. విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు జీవితాంతం గుర్తుండేలా మంచి బహుమతిని అందించాలని, జీవితం అందమైనదని, ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని, కోపం, సోమరితనం వీడి ఎప్పటి పనులు అప్పుడు చేసే విధంగా అలవాటు చేసుకోవాలని, సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని, నెల రోజులపాటు పూర్తిగా ముట్టుకోవద్దని, మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ను పెంచుకోవాలని, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యా యులు రాజేంద్ర ప్రసాద్, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
