
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్..
రుద్రూర్, అక్టోబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మెషిన్ రీడబుల్ ఓటరు జాబితాను ఫోటోలతో పాటు ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలన్నారు. తొలగింపు, చేర్పు జాబితాలను బహిరంగంగా విడుదల చేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు. తప్పుడు తొలగింపులకు అందుబాటులో ఉండే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొందించాలన్నారు. చివరి నిమిషంలో తొలగింపు లేదా ఓట్ల జోడింపును నివారించాలని, స్పష్టమైన కట్ ఆఫ్ తేదీని చాలా ముందుగానే ప్రకటించాలన్నారు. రుద్రూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఓటు చోర్ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, పార్వతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.