
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం వావిలేరు, పాడేరు గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మేడం మాట్లాడుతూ ,రైతులను ఉద్దేశించి ప్రత్యామ్నాయ పంటగా సీఐలేజ్ మొక్క జొన్న పంటను సాగు చేసి 75 రోజులలో తక్కువ ఖర్చు తో అధిక ఆదాయము పొందా వచ్చునని తెలియ చేసినారు.దీనికి సంబంధించి జిల్లాలో ట్రూ మీల్ కంపెనీ ఒప్పంద ప్రాతిపదికన రైతుల దగ్గర టన్ను ఒక్కింటికి రూ.2250/ చొప్పున ఇస్తున్నారనియు , సగటున ఒక ఎకరమునకు సాగు ఖర్చు పోను రూ.20000/ నికర ఆదాయము వస్తుందని తెలియచేసారు.కాబట్టి జిల్లాలోని రైతాంగం సైలేజి మొక్కజొన్న సాగుపై దృష్టి సారించాలని తెలియచేసారు. అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా ఏ డి ఏ. నర్సోజి మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు. హిమ బిందు . రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వం పథకాలు రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్ కార్డు పొందాలని ఆమె సూచించారు. సైలె జి మొక్కజొన్న సాగుపై సందేహాలు ఉన్నచో విశ్రాంత సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్ 9490247908 కి సంప్రదించాలని మనవి చేయుచున్నాను. ఈ కార్యక్రమం లో నెల్లూరు ఏ డి ఏ . బి . శ్రీదేవి గ్రామ సర్పంచ్ గోనుగుంట. రాంబాబు. వి ఏ ఏ. సూర్య నారాయణ, హజర్త. వ్యవసాయ రైతులు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు
