
శ్రీశైల క్షేత్రం చుట్టూ పోలీసుల డేగ కన్నుతో నిఘా.
ప్రధాని పర్యటించే ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ…
అడిషనల్ ఎస్పీ స్థాయి నుండి ఎస్సై స్థాయి వరకు బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీస్ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ..
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
ఈనెల 16వ తేదీన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, నంద్యాల జిల్లా శ్రీశైలం నందు పర్యటించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS, సుమారు 1800 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి హెలిపాడ్ కు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కూడళ్లలో సాయిధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది.బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక ఉన్నతాధికారిని ఇన్చార్జిగా నియమించడం జరిగింది.జియో గ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవలసిన భద్రత చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు.ప్రధాని మంత్రి కి భద్రతాపరంగా అత్యంత భద్రత ఉంటుందన్నారు.రోడ్డు మార్గాలలో, ముఖ్యమైన కూడళ్లలో ,గుడి పరిసర ప్రాంతాలలో రూప్ టాప్ సిబ్బందిని నియమించి వారికి బైనాక్యులర్ తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించడం జరిగింది.శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా నిఖీచేయాలని ఇది 24/7 కొనసాగించాలన్నారు.కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.హెలిపాడ్, గుడి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాంతాలలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో యాక్సెస్ కంట్రోల్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కొరకు రూప్ టాప్, క్యూఆర్టి, స్పెషల్ పార్టీలను నియమించుకోవాలని ఆదేశించారు.ప్రధాని పర్యటనకు వచ్చిన సుమారు 1800 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రత్యేకమైన డ్యూటీ పాసులను ఆత్రేయ డిజిటల్స్ వారి సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది.డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడి కార్డులు ధరించాలన్నారు. రెవిన్యూ అధికారులు ఇచ్చిన ఆసులను క్షుణ్ణంగా తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.

