
పయనించే సూర్యుడు మార్చి 24 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా చేజర్ల మండలంలోని చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ రోజు డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆదురుపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంను సందర్శించారు. విద్యార్థులకు క్షయ వ్యాధి లక్షణాలను నిర్మూలన పద్ధతులను గురించి వివరించడం జరిగింది. వరల్డ్ టీబి డే సందర్భంగా టిబి హరేగా దేశ్ జీతేగా నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో గురుకులం ప్రిన్సిపల్ శైలజ కుమారి,వైద్య సిబ్బంది, విద్యార్థి విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.