
.
( పయనించే సూర్యుడు జూలై 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్న గుడ్డ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని షాద్‌నగర్‌లో ఉన్న విజయ కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రలాల్ రాథోడ్ ఈ శిబిరానికి నాయకత్వం వహించారు.ఈ శిబిరానికి గ్రామస్థులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. సుమారు 250 మంది పైగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఇందులో కొత్త షుగర్ రోగులు – 26 మంది కొత్త డయాబెటిస్ రోగులు – 21 మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు – 88 మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు – 14 మంది చర్మ సమస్యలతో బాధపడేవారు – 10 మందిని గుర్తించడం జరిగింది అ లాగే 62 మందికి పైగా ECG పరీక్షలు ఉచితంగా నిర్వహించబడ్డాయి. అదేవిధంగా, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ వైద్య శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు మరియు హృదయ సంబంధిత జాగ్రత్తలపై అవగాహన కలిగింది. గ్రామస్థులు హృదయపూర్వకంగా హాస్పిటల్ సిబ్బందికి మరియు డాక్టర్ చంద్రలాల్ రాథోడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
