
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 25 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఈ రోజు చింతూరు ITDA ప్రాజెక్ట్ అధికారి శ్రీ అపూర్వ భరత్ IAS గారు ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీని ప్రారంభించడం జరిగినది ఈ ర్యాలీ ITDA నుండి చింతూరు మెయిన్ సెంటర్ వరకు కొనసాగినది.ఈ ర్యాలీ ని ఉద్దేశించి ప్రాజెక్ట్ అధికారి గారు మాట్లాడుతూ.. మలేరియా రహిత సమాజమే ప్రపంచ మలేరియా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం అని తెలియ చేసినారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దోమ తెరలు వాడాలని, ఇంటిచుట్టూ మురుగు నీరు నిల్వలు లేకుండా చూడాలని, ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని,తెలియచేసినారు. చింతూరు డివిజన్ లో మలేరియా కేసుల నమోదు గత సంవత్సరం 2023లో 591 కేసులు, 2024 లో 382 కేసులు ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 20 వరకు 170 కేసులు నమోదయినవి అని తెలియ చేసినారు,ఈ మలేరియా కేసుల నియంత్రణ చర్యలలో భాగంగా మొదటి విడత దోమల మందు పిచికారీ కార్యక్రమం ఏప్రిల్ 15 వ తేదీ నుండి జూన్ 15వరకు ఉంటుందని,ఈ సంవత్సరం మలేరియా తీవ్రత అధికంగా ఉన్న 192 గ్రామాలను గుర్తించి దోమల మందు పిచికారీ కార్యక్రమం అమలు చేయాలని తెలియచేసినారు. దోమల మందు పిచికారీ ఏప్రిల్ 15 వ తేదీ నుండి ఈ రోజు వరకు 44 గ్రామాలలో పిచికారీ చేయడం జరిగినది. కావున ప్రజలందరూ తప్పకుండా దోమల మందు పిచికారీ ప్రతీ ఇంట్లో… ప్రతీ గది లోపల చేయించు కోవాలని మన ప్రాంతంలో దోమలు పుట్టకుండా, కుట్ట కుండా జాగ్రత్తలు పాటించాలని తెలియచేసినారు.ఈ ర్యాలీ లో డిప్యూటీ డి ఎం& హెచ్ ఓ డాక్టర్ పుల్లయ్య గారు, తులసిపాక వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ గారు, ఐ సి డి ఎస్ & పీహెచ్సీ సూపెర్వైసోర్స్,ANMs హెల్త్ అసిస్టెంట్స్,, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా కార్యకర్తలు, పాల్గొనడం జరిగినది.