
పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని తెలిపిన అర్బన్ వైద్యశాల డాక్టర్ షేక్.ఆస్మా. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు అర్బన్ వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఆశా వర్కర్లు. ఏఎన్ఎమ్ లు. సిబ్బంది ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ అర్బన్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి బయలుదేరి బిఎస్సార్ సెంటర్ మీదగా ర్యాలీ నిర్వహిస్తూ తిరిగి వైద్యశాలకు చేరుకున్నారు..ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు అంటూ నినాదాలు చేస్తూ మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం అర్బన్ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ షేక్.ఆస్మా మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ సిబ్బందితో ర్యాలీ నిర్వహించామని ప్రజలు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధి లక్షణాలను వ్యాధి నివారణను వైద్యుల ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న వైద్య సిబ్బందికి పట్టణ ప్రజలకు డాక్టర్ ఆస్మా ధన్యవాదాలు తెలిపారు.అర్బన్ వైద్యశాల హెల్త్ సూపర్వైజర్.సిద్ధం.సుధాకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు