పయనించే సూర్యుడు జనవరి 19 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)… 19వ తేదీ ఆదివారం కోనసీమ చిత్రకళ పరిషత్ వారు అమలాపురంలో నిర్వహించిన 35వ ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ లో మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తున్న కుల్లూరు గ్రామస్తుడు, కళామతల్లి ముద్దుబిడ్డ తోట కిషోర్ కుమార్ ఈ చిత్రకళా పోటీలో కళానిధి అవార్డును గెలుచుకున్నారు.గతంలో ఈయనకు మూడుసార్లు నేషనల్ అవార్డులు రావడం విశేషం.ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అవార్డు అందుకోవడంతో తన బంధుమిత్రులు, ప్రధానోపాధ్యాయురాలు,తోటి సిబ్బంది, అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ప్రపంచ స్థాయి అవార్డు మన తెలుగు వాడు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని గ్రామస్తులు అభినందించారు.
ప్రపంచ స్థాయి కళానిధి అవార్డు సాధించిన కిషోర్ కుమార్
RELATED ARTICLES