
షాద్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో ఉన్న దేవిశ్రీ ఇస్పత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ గోయంకా గారు 11.0 లక్షల రూపాయల విరాళాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి అందించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాని ప్రకాష్ గోయంకా గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చవివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకై నాణ్యమైన విద్య అందించాలానే ఉద్దేశ్యంతో కళాశాల నిర్మించడం గొప్ప విషయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోముల బసప్ప తదితరులు పాల్గొన్నారు.
