
//పయనించే సూర్యుడు //న్యూస్ అక్టోబర్ 14// నారాయణపేట జిల్లా బ్యూరో //
నారాయణపేట జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీనుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి. మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేయడం జరిగింది. వర్షాలు సరిగ్గా కురిసి పంట ఏపుగా పెరిగి పంట చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలకు పూత, పిందె రాలి పంట దిగుబడి సగానికి పడిపోయిందని అన్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో అత్యధికంగా 7500 నుండి అత్యల్పంగా 4,500 వరకు ధర చెబుతున్న రైతుకు సరాసరి 5500 నుండి 6000 వరకు మాత్రమే ధర వస్తుందన్నారు. దీనితో రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకపోయే పరిస్థితి ఉందన్నారు. రైతుకు కొంతమేర ఊరట ఇవ్వాలంటే ప్రభుత్వం తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తేమశాతం 20 ఉన్న ప్రభుత్వం ప్రకటించిన ధరకు రూ,, 8110/-లకు కొనుగోలు చేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశ వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభానికి గురవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 60 లక్షల కుటుంబాలకు పైగా ప్రతి పంటను సాగు చేస్తున్న వారికి సరైన ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలి కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూన్నది. భారత్ -అమెరికా పరస్పర ఒప్పందంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఒత్తిడికి గురై పత్తిపై ఉన్న 11% సుంకాన్ని రద్దు చేయడం దేశ పత్తి రైతులకు గొడ్డలి పెట్టు లాంటిది అన్నారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రైతు పెట్టుబడి పై 50% C2+ 50 కలిపి ధర నిర్ణయించాలి ఈ రకంగా కాకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొడవు పింజారాకానికి 8110/- రూ,,లు, మధ్యస్థ రకానికి 7710/-రూ,, లుగా నిర్ణయించడం జరిగింది. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధర పత్తికి 10075 రూపాయలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పై ధరలు కూడా ప్రస్తుతం దేశంలో అమలు కావడం లేదు ప్రస్తుతo నారాయణపేట జిల్లాలో పత్తి మార్కెట్లో మెజారిటీగా యావరేజ్ రేటు 6000 మాత్రమే ధర చెల్లిస్తున్నారన్నారు. అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి 3,4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. అధిక పెట్టుబడులు పెట్టి అప్పుల పాలై రైతు తీవ్రమైన నష్టానికి గురవుతున్నారన్నారు. దీని కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, కొండ నరసింహులు, సహాయ కార్యదర్శి బి నారాయణ, ఉషప్పు, నర్సిరెడ్డి నర్సింహులు, చుక్కప్ప తదితరులు పాల్గొన్నారు
