Tuesday, March 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి…… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి…… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Listen to this article
  • వైద్య శాఖ ప్రజలకు సేవా దృక్పథంతో పని చేయాలి
  • ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలి
  • ఆసుపత్రి ఏర్పాటు చేసిన వైద్య సేవల సూచికలు, హెల్ప్ డెస్క్ పరిశీలన
  • ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పయనించే సూర్యుడు. మార్చి 5. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

  • ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటి, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నొస్టిక్ సెంటర్, ఎంపిహెచ్ డబ్ల్యు. ట్రైనింగ్ సెంటర్, ఎంసిహెచ్, ఓపి, ఇన్ పెషెంట్ వార్డు, అవుట్ పేషేంట్ వార్డు, గుండె సంబంధిత సెంటర్, కళ్ల చిక్సిత కేంద్రం, గర్భిణీ స్త్రీల వార్డ్, మైత్రి ట్రాన్స్ క్లినిక్, మందులు, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల నిల్వలు సరిపడా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ, ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ అధికారులతో కలిసి ఆసుపత్రి మొత్తం తిరిగి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. కావలసిన వసతి ఏర్పాట్లపై, పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. దివ్యాంగులచే నిర్వహిస్తున్న పెయిడ్ పార్కింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా శక్తి పథకంలో భాగంగా హాస్పటల్ లో నడుపుతున్న క్యాంటీన్ ను కలెక్టర్ సందర్శించారు. నిర్వాహకులతో ముచ్చటించారు. వైద్య కోసం వచ్చే వారికి, వారి సహాయకులకు మంచి రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. ప్లాస్టిక్ వస్తవులను ఉపయోగించవద్దని సూచించారు. ఆనతరం హాస్సటల్ లో రోగులకు, వారి సహాయకులకు సత్యసాయి సేవా అన్నదానం కార్యక్రమంలో కలెక్టర్ భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,  ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడం, సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే పౌష్టికాహారం, భోజనం రుచికరంగా,  పౌష్టికాహారంతో కూడుకున్నదై ఉండాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మందుల రికార్డులు, ఇతర రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు వివరించారు. హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం క్రింద జిల్లా ఆసుపత్రిలో ఎన్.సి.డి. క్లినిక్ విభాగం ఏర్పాటు చేసి రక్తపోటు, వృద్ధాప్య సేవలు, మానసిక సమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, నోటి సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాత నివారణకు వైద్య సౌకర్యాలు కల్పించమని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి. కిరణ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments