
కళాశాల నిర్మాణానికి రూ.15 లక్షల విరాళాన్ని అందించిన కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి
దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శనివారం కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి రూ.15 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా బంకట్ లాల్ భాటి గారు మాట్లాడుతూ..ప్రభుత్వ కళాశాలలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అంచించాలనే ఆలోచన గొప్పదని తెలిపారు.కావున మా సంస్థ ద్వారా రూ.15 లక్షల విరాళాన్ని అందించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… పేద విద్యార్థుల చదువుల కోసం దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.