
ఉపాధ్యాయుడు దివంగత కుంచెం శ్రీశైలం పేరిట ఆయన కుమారుడు విజయ్ కుమార్ విరాళం..
ఎమ్మెల్యే చేతికి చెక్కు అందజేత..
అభినందించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
అక్షరధాతగా, ఉపాధ్యాయుడిగా దశాబ్దాల పాటు సేవలు అందించిన తన తండ్రి జ్ఞాపకార్థం తనయుడు విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ఇచ్చి తన ఔదార్యాన్ని చాటాడు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు చెందిన షాద్ నగర్ వాసి విజయ్ కుమార్ తన తండ్రి దివంగత కుంచెం శ్రీశైలం పేరిట షాద్ నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ తండ్రి తనకు గురువు లాంటి వారని, అతని తల్లితండ్రులను సొంత కొడుకులా చూసుకునేదని తెలిపారు. అతని సోదరుడు తనతో పాటు చదువుకున్నాడని, వారి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. ఈరోజు కళాశాల కోసం సాయం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాజీ జెడ్పిటిసి దామోదర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
