
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్
శనివారం ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ సి.జయాపాల్ రెడ్డి అధ్యక్షతన మాదకద్రవ్యాల నివారణపై సదస్సు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టూడెంట్స్ కౌన్సిలర్స్ డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్ పలు సూచనలు చేస్తూ, నిత్యజీవితంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత అధిక సంఖ్యలో పెరిగినారు. ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాలను కోల్పోతున్నారు. అంతేకాకుండా అనేక వ్యాధుల బారిన పడి తమకు తాము ఆ బాధలను అనుభవిస్తూ తమను కన్న తల్లిదండ్రులకు కూడా అనేక విధాల శోభకు గురి చేయడము జరుగుతుంది. కాబట్టి ఎలాంటి మాదకద్రవ్యాల ఉచ్చులో పడి తమ జీవితాలను వ్యర్థం చేసుకోవద్దని కౌన్సిలర్లు చాలా చక్కని సందేశాత్మకంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ సి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిన్న వయసులో ఈ దశలో ఉన్న యువతి యువకులు ఎవ్వరు కూడా ఎలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా పలు సూచనలు చేయడమే కాకుండా ఇలాంటి వ్యసనాల బారిన పడ్డ యువత తమ ప్రాణాలను కోల్పోతూ తీవ్ర నష్టానికి లోనవుతున్నారు. అంతేకాకుండా అమూల్యమైన జీవితాలను వ్యర్థంగా కోల్పోవడం మంచిది కాదని, యువతే దేశానికి వెన్నెముక. యువత లేనిదే దేశ అభివృద్ధి జరగదని, దేశం అభివృద్ధి పతన నడవాలంటే యువతనే నడుము కట్టి అనేక రంగాలలో రాణించి దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీపైననే ఉంది కాబట్టి ఎలాంటి మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మీ జీవితాలను మీరే ఆలోచించి కాపాడుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ రెండు సంవత్సరాలలో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో ఉపయోగపడే విధంగా వినియోగించుకుంటారని మరియు రాబోయే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని అందించి కళాశాలకు మంచి కీర్తి ప్రతిష్టలను అందిస్తారని ప్రిన్సిపల్ విద్యార్థులతో కోరారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటలో కళాశాల ప్రిన్సిపల్ సి.జయాపాల్ రెడ్డి స్టూడెంట్ కౌన్సిలర్స్ డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్ అధ్యాపకులు , కళాశాల అధ్యాపకులు, కార్యాలయ నిర్వహణ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
