
(సూర్యుడు సెప్టెంబర్ 27 రాజేష్)
దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జరిగిన అధ్యాపకుల, తల్లి దండ్రుల సమావేశంలో పండుగ వాతావరణం లో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలుపుతూ యిటీవలి కాలంలో జూనియర్ కళాశాల విభాగంలో జరిగిన సంస్కరణలు హెల్ప్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల సహజ సామర్థ్యంను గుర్తింపు, మూర్తిమత్వం ను సరియైన దిశలో వెళ్లే విధంగా ధ్యానము, యోగా క్రమంగా చేయడం జరుగుతుంది ప్రతి శనివారం ఆటలా పోటీల ద్వారా విద్యర్థుల శారీరక మానసిక ఉల్లాసనికి తోడ్పడుతూ అలాగే తల్లిదండ్రుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటు వారి ఉపస్థితి మెరుగ్గా ఉండాలని, విద్యార్థుల అభివృద్ధి కి పూర్తి గా అంకితభావంతో కట్టుబడి ఉన్నామని ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీ వాత్సవ ఈ సమావేశంను ఉద్దేశించి తెలిపారు. అదేవిదంగా మధ్యాన్నం తర్వాత బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నివర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజు, లక్ష్మినారాయణ, సుధాకర్, మంగతానాయక్, శివకుమార్ సంపత్,దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి భాగ్యమ్మ, ,శ్రీనివాస్, శ్రీమతి రమ్య గారు పాల్గొన్నారు.
