
అక్రమంగా భూమిని కొనుగోలు చేసిన పదవి విరమణ పొందిన ప్రదానోపాద్యాయుడు
భూమి విషయంలో ఎమ్మార్వో తో వాగ్వాదం
స్టాంప్ పేపర్ల పై భూమి అమ్మడం ఒకరు వంతు
పాస్ పుస్తకాలు చూయించి వెంచర్లు చెయ్యడం ఒకరి వంతు
అమ్మడం కొనడం ఇద్దరు మాజీ ప్రభుత్వ ఉద్యోగులే
290 ఒకే ఖాతా నంబరు తో రెండు సర్వే నంబర్లు
పయనించే సుర్యుడు నందిపేట్,సెప్టెంబర్ 15, నందిపేట్ మండలం చింరాజ్ పల్లి గ్రామ శివారులోని 40/7/28 లో రెండు ఎకరాల 20 గంటల ప్రభుత్వ భూమి కలదు. ఆ సర్వేలోని భూమిని గతంలో వేరే వారికి అమ్మడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే భూమిని నిజామాబాద్ కు చెందిన పదవి విరమణ పొందిన ఉపాద్యాయుడు అరవింద్ కొనుగోలు చెయ్యడం జరిగింది ప్రభుత్వ భూమిని కొనుగోలు చెయ్యడం చట్టరీత్య నేరం తెలిసి కూడా పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు అక్రమంగా కొనుగోలు చెయ్యడం జరిగింది కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా వెంచర్ చెయ్యడానికి భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు వెంచర్ అనుమతి ఇవ్వాలని చింరాజ్ పల్లి కార్యదర్శికి బెదిరింపులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వెంచర్ అనుమతి ఇవ్వకుంటే తానేంటో చూయిస్తానని మాజీ ప్రధానోపాధ్యాయుడు అధికారులకు బెదిరిస్తునట్లు మండలంలో వినికిడి. అసలే ఆ భూమి ప్రభుత్వ భూమి అందులో వెంచర్ ఇవ్వాలని అధికారులకు బెదిరించడం ఎంత వరకు సబబని ప్రజలు వాపోతున్నారు పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు తహసీల్దార్ కు ఇష్టమొచ్చినట్లు మాట్లాడం జరిగిందని, తన భూమిలోకి ఎవరైనా వస్తె ఊరుకునేది లేదనీ బెదిరించినట్లు తెలిసింది గతంలో 1993 నుండి 100 రూపాయల స్టాంప్ పేపర్ల పై గజాల చొప్పున అమ్మి ప్రస్తుతం వ్యాపార సముదాయాలు నిర్మిస్తూ మాజీ విఆర్వో కోట్లు దండుకుంటున్నాడు మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలోని పట్ట పాస్ బుుక్