
పయనించే సూర్యుడు గాంధారి 27/04/25 గాంధారిలోని సాయిలు టీ పాయింట్ వద్ద పక్కన గల బోర్ మోటార్ వద్ద ఒక వ్యక్తి వాటర్ తాగటానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కలిగి కింద పడిపోయినాడు అక్కడ ఉన్న వ్యక్తులు గాంధారి SI ఆంజనేయులు కి సమాచారం రాగా వెంటనే బ్లూ కోర్ట్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ కిషన్ గౌడ్ మరియు సందీప్ ని పంపగా, వాళ్లు వెంటనే ఆక్కడికి వెళ్లి కరెంట్ షాక్ కరెంట్ షాక్ తలిగిన మలావత్ సక్రం s/o ఫకీరా r/o పరమాల తాండ ,మాతూ సంఘం ఆటోలో గాంధారి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చి అక్కడి నుండి అంబులెన్సు లో మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొని వెళ్లడమైనది. అట్టి వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ఇట్టి విషయమై త్వరితగతిన స్పందించిన కానిస్టేబుల్ కిషన్ మరియు సందీప్ ని సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ అభినందించనైనది