పయనించే సూర్యుడు గాంధారి 10/10/25
గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో గల గిద్ద చెరువు వద్దకు అదే గ్రామానికి చెందిన దుర్కి సాయవ్వ, భర్త ప్రసాద్, వయసు 40 సంవత్సరాలు గారు, తన భర్త రెండో పెళ్లి చేసుకొని నిజాంసాగర్ లో నివసిస్తుండగా, ఈమె పెద్ద పోతంగల్ గ్రామం నందు ఒంటరిగా నివసిస్తూ ఉన్నది. గ్రామస్తుల కథనం ప్రకారం మరియు అలాగే నేరస్థలంలో ఉన్న చెప్పులు మరియు బహిర్బుమి కి వెళ్లిన లోట ద్వారా తెలుస్తున్నది ఏమనగా ఈరోజు ఉదయం అందాజు 9 గంటలకు సాయవ్వ బహిర్బుమి/ కాలకృత్యాలు చేయుటకై గిద్ద చెరువు వద్దకు వెళ్లి, బహిర్ భూమికి వెళ్లి, అక్కడ చెరువు దగ్గర కాలుజారి అందులో పడి ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా కనబడుతున్నది. మృతురాలి యొక్క ఏకైక కూతురిని గత మూడు నెలల క్రితం కోటగిరి పోతంగల్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగినది. కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు

