పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
కర్నూలు జిల్లా ఉలిందకొండ, చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటన లో ప్రయాణికుల సజీవ దహనం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి ఫరూక్.ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని కర్నూలు అధికార యంత్రాంగానికి మంత్రి ఫరూక్ ఆదేశం

