
పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు నియోజవర్గం పరిధిలోని పలు మండలాల పరిధిలోని మంగళవారం పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. పట్టణంలోని మూడు కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు పూర్తయి పరీక్ష కేంద్రాల నుండి విద్యార్థులు ఎంతో సంతోషంగా బయటికి రావడం కనిపించింది. విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరీక్షించారు.పదవ తరగతి పరీక్షలు కావడంతో ఇటు విద్యార్థులలో వారీ తల్లిదండ్రులలో కూడా ఈ పరీక్షలు జరిగినన్నీ రోజులు ఆందోళన తో ఉన్నారు. మంగళవారం పరీక్షల ప్రశాంతంగా ముగియడంతో ఆనందంగా పరీక్ష కేంద్రాల నుండి ఇళ్లకు తరలి వెళ్లారు.