
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి మసీదు వద్ద పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ త్రాగునీటి సరఫరా, విద్యుత్ సంబంధిత మరమ్మత్తులు ఏదైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి రంజాన్ మాసం ప్రశాంతంగా నిర్వహణకు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్ లు ఖమ్మం: ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ మాసం ప్రశాంత వాతావరణం లో నిర్వహణకు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్థ్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో సైతం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేస్తూ, రంజాన్ మాసం ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం ప్రతినిధులకు సూచించారు. ప్రతి మసీదు దగ్గర పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదైనా మసీదు దగ్గర త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏదైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని, త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని, రంజాన్ మాసం సందర్భంగా సమయానుకూలంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో ఉన్న మసీదుల జాబితా తయారు చేసి రెగ్యులర్ గా అక్కడ పారిశుధ్య పనులు జరిగేలా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని, సాయంత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదు చుట్టు ప్రక్కల ఉన్న వీధిలైట్లు, హైమాస్ లైట్లు వెలగాలని, రంజాన్ పర్వదినం నాడు ఈద్గా వద్ద చెత్త తొలగించే విధంగా ఏర్పాట్లు చేయాలని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ రంజాన్ మాసం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేయడంతో పాటు, ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ శాఖ దృష్టికి తీసుకొని రావాలని, ప్రతి మసీదు పరిసరాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, ఆర్డీఓలు నరసింహారావు, ఎల్. రాజేందర్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లా, ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
