
మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24( శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ డాక్టర్ పరమేష్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు బుధవారం ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను తనిఖీ చేసి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ల్యాబ్ రికార్డులు తనిఖీ చేసి ఏం ఎఫ్ టు ఎమ్ ఎఫ్ సెవెన్ ఎం ఎఫ్ 8 రికార్డులను చూసి ఏఎన్ఎంలు గ్రామాలను తీసిన రక్తపుతలను తప్పక పరీక్షించాలని అన్నారు. అదేవిధంగా జ్వరము అని వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గునియా మొదలగు రక్త పరీక్ష నిర్వహించాలన్నారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ శిరీష కు తగు సూచనలు సలహాలు వచ్చారు . ప్రజలకు జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి రక్త పూతలు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ్ కుమారి ల్యాబ్ టెక్నీషియన్ శిరీష ఆశా కార్యకర్తలు సులోచన సునీత ముస్కినా పాల్గొన్నారు
