
పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.20/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యార్థుల కంటి చూపు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లోపం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.
జాతీయ అంతత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాలలో స్థానిక వైద్యాధికారులు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కంటిచూపు సమస్య రావడానికి ప్రధాన కారణం ఎక్కువసేపు సెల్ ఫోన్లు, టీవీలు చూడడం, ఏ విటమిన్ ఉన్న ఆహార పదార్థలను తీసుకోకపోవడమే అన్నారు. ప్రస్తుత తరుణంలో చదువు లో పోటీతత్వం ఎక్క వైయ్యిందని, ఇలాంటి సమయంలో పిల్లలకు కంటి చూపు తగ్గితే అది వారి చదువుకు, ఉజ్వల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్నారు. ఈ కీలక సమస్యను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. నారాయణవనం మండలంలోని నాలుగు ఉన్నత పాఠశాలకు సుమారు 178 కంటి అద్దాలను అందించడం పై ఎమ్మెల్యే హర్షం వ్యక్తంచేశారు.
భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పక ఉందన్నారు కంటి చూపు సమస్యను తల్లిదండ్రులు కూడా గుర్తించి సంబంధిత వైద్యాధికారులకు తెలియజేస్తే ప్రాథమిక దశలోనే ఈ సమస్యను నివారించుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు శ్రీ కోనేటి సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి, సర్పంచ్ కేజీ శారదమ్మ గణేషన్, ఉపసర్పంచ్ జిల్లా కంటి వైద్య అధికారి మధుబాబు, స్థానిక డాక్టర్ దర్శిత్ రాజ్, ఎంపీడీఓ గుణశేఖర్, డిప్యూటీ డీఈవో ప్రభాకర్ రాజు, స్థానిక నాయకులు కే శివకుమార్, దొర రాజ్, ఉపాధ్యాయులు, వైద్య బృందం పాల్గొన్నారు.