
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 7(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి లోని నంబర్ ఫోర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. పాఠశాలలోని మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, పాఠశాల పరిసరాలలో శుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి ఆదేశించారు. స్కూల్ ఆవరణములో నూతనంగా అబ్దుల్ కలాం గారి విగ్రహాని ఏర్పాటు చేస్తున్న విగ్రహ దాత జూటూరు అబ్దుల్ రజాక్ కు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టి.డి.పి. మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎం.పీ.పీ. వేలూరి రంగయ్య, టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, సింగిల్ విండో అధ్యక్షుడు చలమారెడ్డి, రవికుమార్ రెడ్డి, బొట్టు శేఖర్, మధురాజు, విశ్వనాథ్, గండికోట లక్ష్మణ్, సెల్ పాయింట్ చాంద్ బాషా, ఫైబర్ చందు, నీలకంఠ రెడ్డి, తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
