
పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ పి యాప్ విత్‌డ్రా ఆటో మేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.ఒక లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను ఆలస్యం లేకుండా సులభంగా పొందవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇపియప్ఒ తన 7.5 కోట్ల మంది సభ్యులకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటి ల్మెంట్ల ఏ ఎస్ సీ పరిమితిని పెంచాలని నిర్ణయించింది. గత వారమే శ్రీ నగర్‌లో జరిగిన ఇ పి యాప్ ఒ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ఈ ప్రతిపా దనను ఆమోదించారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సి బి టి నుంచి తుది ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పుడు ప యాప్ అడ్వాన్స్ క్లెయిమ్ ఎ యస్ ఎసి పరిమితి రూ. ఐదు లక్షల వరకు ఉంటుంది. అంటే పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇప్పు డు ముడు నుంచి నాలుగు రోజుల్లో జరుగుతుంది. గతంలో పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు, వివాహం, విద్య, ఇల్లు కొనడానికి కూడా ఆటో-క్లెయిమ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే, గతంలో ఆటో- క్లెయిమ్ అనారోగ్యం, ఆస్ప త్రి ఖర్చులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపియప్ఒ ఖాతాదారులకు ప్రయోజనాలివే ఈపీఎఫ్ఓ ప్రకారం95 శాతం క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటో-ప్రాసెస్ అవుతాయి. కోట్లాది మంది ఉద్యోగులకు వెంటనే పీఎఫ్ డబ్బు చేతికి అందుతుంది. పేపర్ వర్క్ ఉండదు. గతంలో ఇరవై ఏడు దశల్లో ఉండేవి. కానీ, ఇప్పుడు 18 మాత్రమే ఉన్నాయి. త్వరలో ఆరు దశలు మాత్రమే మిగిలి ఉంటాయి. అతి త్వరలో పి యాప్ డబ్బు లను యూపీఐ ఎటియమ్ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రకారం ఈ సదుపాయాన్ని మే-జూన్ నాటికి అమలు చేయవ చ్చు.ఈ బెనిఫిట్ ఎప్పుడు లభిస్తుందంటే? ఎంప్లా యీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సి బి టి నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ సౌకర్యం అందుబాటు లోకి రానుంది. ఆ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్‌ను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. గత వారమే కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ యన్ పి సి ఐ సిఫార్సును ఆమోదించిందన్నారు.