
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని అంత్రాల వీధిలో నివాసం ఉంటున్నా జానాపాటి శ్రీనివాసులు అలియాస్ ప్రెస్ శీనా గత 20రోజుల క్రితం అనంతపురలో బైక్ ఆక్సిడెంట్ లో గాయపడి బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకొని శీనా స్వగృహం చేరుకొన్న విషయం తెలుసుకొన్న బొంబాయి రమేష్ నాయుడు శీనా నివాసం చేరుకొని పరామర్శించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, గుంత తిరుపతి మరియు వైసీపీ నాయకులు చిట్టెం రెడ్డి బాల్ రెడ్డి, భార్గవ, దూద్ వలి తదితరులు పాల్గొనడం జరిగింది.
