
ఒకవైపు విద్యార్థులు బలి..మరోవైపు అమ్మాయిలపై వార్డెన్ ల దాస్టికం.
విద్యా సంవత్సరం కాకముందే అడ్మిన్స్ ఎలా చేస్తారు?
మరోసారి మేధా స్కూల్ ఘటనపై మండిపడ్డ విద్యార్థి సంఘాలు.
కళ్లుమూసుకున్న విద్యా శాఖ అధికారులు.!
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు.
ప్రవేట్ విద్యా సంస్థలకు,ప్రైవేట్ విద్యా సంస్థల తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు.
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ హెచ్చరిక.
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ ) విద్యా సంవత్సరం కాకముందే ప్రైవేట్ పాఠశాలలో అడ్మిన్స్ ఎలా చేస్తారని మండిపడుతున్నారు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్…మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కానున్న సందర్బంగా నియోజకవర్గంలో చాలామంది ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న అడ్మిన్స్ పై మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు.ఈ సందర్బంగా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ,,,వార్షిక పరీక్షలు ఇంకా పూర్తి కాకముందే ప్రవేట్ విద్యా సంస్థలలో అడ్మిన్స్ ఎలా అనుమతి ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదంతా విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లనే కాదా అంటూ మండిపడ్డారు..ప్రవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నదని న్నారు.ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యా సంవత్సర ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై విద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు మద్దతు కల్పిస్తున్నారా అని అటు విద్యా శాఖ పై ఇటు ప్రభుత్వం పై మండిపడ్డారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో నాడు విద్యార్థులు ఎన్నో ఆత్మహత్యలకు గురవుతున్నా గానీ నేటికి ఈ అధికారి కూడా స్పందించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం శారు.ఇదిలా ఉంటే గత సెప్టెంబర్ నెలలో పట్టణంలోని మేధా స్కూల్ ల్లో బాలికలపై హాస్టల్ లో వార్డెన్ గా పనిచేయడానికి వచ్చిన 18 ఏండ్ల యువకుడు బాలికలపై అసభ్య ప్రవర్తన ఘటన విషయంలో విద్యా శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని అన్నారు.యాజమాన్యం ఒత్తిడి వల్ల సంబంధిత అధికారులు స్పందించలేదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..ఇదంతా విద్యా శాఖ అధికారులకు తెలిసిన ఎందుకు పట్టించుకోలేదో అంటున్నారు.ఇంకోవైపు ప్రభుత్వం ఆ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పాలని అని ఆకాష్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థి సంస్థలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదా.? ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని (ఏఐఎస్ఎఫ్) అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు.లేనియెడలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.