
రుద్రూర్, నవంబర్ 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
హైదారాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని బాన్సువాడ బ్లాక్ (బి)కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, కార్యకర్తలు షైక్ గౌస్, పార్వతి ప్రవీణ్, కర్కా సాయి లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, ఫరఖాన్ తదితరులు పాల్గొన్నారు.