
*భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 పొనకంటి ఉపేందర్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ భూముల్లో ఫామ్ పౌండ్స్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల అభివృద్ధితోపాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం చంద్రుగొండ పర్యటనలో భాగంగా స్థానికంగా ఉపాధి హామీ పథకం లో రైతు చేపల మడుగు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో 20/20 విస్తీర్ణంలో సుమారు రెండు లక్షల 25 వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ ఫామ్ పౌండ్ నిర్మాణాలు కచ్చితంగా చేపట్టాలని దీని ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ ఫామ్ పాండ్ లద్వారా చేపల పెంపకం చేపట్టి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఒక్క పంట పైనే ఆధారపడకుండా అంతర పంటగా చేపల పెంపకం, మునగ, అజోల్ల వంటివి సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. అనంతరం కలెక్టర్ చేపలమడుగు నాగేంద్ర బాబు అనే రైతు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక ఎకరంలో సాగు చేస్తున్న మునగ సాగును పరిశీలించి మునగ సాగు చేయడానికి ముందుకు వచ్చినందుకు రైతుని అభినందించారు . ఈ సందర్భంగా కలెక్టర్ రైతుకు మునగ సాగు లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పద్ధతులు గురించి వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలంలో 1000 మొక్కలను నాటినట్లు ఆయన తెలిపారు. మునగ మొక్కలు నిటారుగా పెరగడం ద్వారా గాలి దుమ్ము వంటి సమయాల్లో మొక్కలు విరిగిపోయే అవకాశం ఉందని కాబట్టి చిన్న ముక్కలుగా ఉన్నప్పుడే తలవిరుపు చేపట్టాలని రైతుకు సూచించారు. మునగ సాగు వలన వచ్చే లాభాలను గురించి వివరించారు. మునగాకు పౌడర్ ద్వారా లాభాలు ఆర్జించవచ్చని రైతులకు తెలిపారు.మునగ సాగు చాలా లాభసాటి మరియు పర్యావరణ అనుకూలమైన పంట అని అన్నారు.మునగ ఆకులు, కాయలు, విత్తనాలు, పూలు మరియు వేర్లు అన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ఇది చిన్న, సన్నకారు రైతులందరికీ ఒక మంచి ఆదాయ మార్గం, ఎందుకంటే దీనికి తక్కువ నీరు మరియు కూలీల అవసరం ఉంటుందని,అంతేకాకుండా, ఎరువులు, పురుగు మందులు కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటారు కాబట్టి , కాయలను సులభంగా, తకువ కాలంలోనే స్థానిక మారెట్లకు తరలించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట చండ్రుగొండ తాసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎండ్ న్యూస్