
పయనించే సూర్యుడు నవంబర్ 1 మక్తల్:
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా మక్తల్ బస్టాండ్ లో ప్రజల ఆస్తిరక్షణ దొంగతనాల నివారణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని మక్తల్ పోలీసులు మహేష్ తెలిపారు. శనివారం మక్తల్ బస్టాండు ప్రధాన చౌరస్తాలలో మక్తల్ పోలీసులు మహేష్, శ్రీహరి లు అకస్మికంగా ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తగిన రీతిలో పరిశీలించి, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫింగర్ ప్రింట్ డివైస్ తో వ్యక్తుల వేలిముద్రలు సేకరించి క్రిమినల్ రికార్డులతో సరి పోల్చారు. పౌరులు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.