
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్
( పయనించే సూర్యుడు మే 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కూలీలకు రోజువారి హాజరు మరియు కొలతలు వివరాలు తీసుకున్న. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం షాద్నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు షాద్నగర్ ఆర్డీవో అధికారికి విన్నవించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ మాట్లాడుతూ. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకి జీతాలు రాకపోవడంతో ఉపాధి కార్మికులకు పని కూడా చూపెట్టలేకపోతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వారి జీతాలను వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 18000 ఇచ్చి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం. ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని లేనిచో ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు కార్మికులు అందరు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం నాయకులు రత్నం. యాదయ్య. కృష్ణయ్య శ్రీనివాస్. శంకర్. కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు