
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినీలు…
రుద్రూర్, జూలై 05 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులో గల మోడల్ కళాశాల వసతి గృహంలో ఎనిమిది మంది విద్యార్ధినీలకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే విద్యార్థినిలను వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసతిగృహ ఏఎన్ఎం విద్యార్ధినీలకు భోజనం చేయకముందు ఐరన్ మాత్రలు వేసుకోమని ఇచ్చారని, దీని మూలంగానే విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయిందని కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్ప తెలిపారు. ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిఈఓ వెంటనే స్పందించి ఏఎన్ఎం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరారు.